అమ్మ భాషకు జేజేలు

Prev
1/8 Next »

‘మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఈనాడు ఆదివారం అనుబంధ సంచిక కోసం శ్రీ. కర్లపాలెం హనుమంతరావు రాసిన ప్రత్యేక వ్యాసం ఇది. మన తల్లి భాష మీద చూపించవలసిన బాధ్యతను మరోసారి మనకు గుర్తుచేస్తోంది. చదవండి!

కనిపించుట లేదు పేరు: తెలుగు
 వయసు: క్రీస్తుపూర్వం నాటిదని చెబుతారు.
ముద్దుపేర్లు: జాను తెలుగు, తేనె తెలుగు
 గుర్తులు: ముద్దుగా, బొద్దుగా ఉంటుంది. ‘తలకట్టు’ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ‘ప్రాచినభాష హోదా’ అనే
 కొత్తగౌను తొడుక్కుంది.

”చిట్టితల్లీ! నువ్వెక్కడున్నా సరే, మాతృభాషా దినోత్సవం నాటికి తిరిగొచ్చెయ్‌. ఇకనుంచి నిన్ను చులకనగా
 చూడం. ‘ఐ నెవర్‌ స్పీక్‌ ఇన్‌ టెల్గు’ బోర్డు తగిలించి బాధపెట్టం. నీ రాతలే రాస్తాం. నీ మాటలే మాట్లాడతాం. నీ
 పాటలే పాడతాం. నిన్ను కాపాడుకునే పూచి మాది”
ఆచూకీ తెలపాల్సిన చిరునామా:
ఆదికవి నన్నయ విగ్రహం, ట్యాంక్‌బండ్‌, హైదరాబాద్‌.

బిడ్డ భూమ్మీద పడగానే ముందుగా కనిపించేది అమ్మ వెుహమే. ముందుగా వినిపించేది అమ్మ మాటే.
ముందుగా పలికేది ‘అమ్మ…’ అనే కమ్మని పలుకే. అందుకే అది అమ్మభాష అయింది. బిడ్డ ఎదుగుదలకు
 అమ్మపాలెంత అవసరవో, వికాసానికి అమ్మభాషంత ముఖ్యం! మానసిక శాస్త్రవేత్తలు కూడా అంగీకరించిన
 మాటిది.


ఏ భాష అయినా మాతృభాష తర్వాతే.
ఏ మాట అయినా తెలుగుమాట తర్వాతే.


శతాబ్దాల నాడే మన అజంతాల భాష దిగంతాలకు వ్యాపించింది. క్రీస్తుశకం ఒకటో శతాబ్దం నాటికే శాతవాహన చక్రవర్తి హాలుడు తన ‘గాథాసప్తశతి’లో తెలుగు పదాలు ప్రయోగించాడు. ప్రపంచ కథానికల్లో వెుట్టవెుదటిది, గుణాఢ్యుడు రాసిన తెలుగు కథే. తెలుగు భాషలో ప్రతి ఉచ్చారణకీ ఓ ప్రత్యేకాక్షరం ఉంది. పదం చివరలో అచ్చులు చేర్చుకునే సులువుండటం వల్ల ఏ భాషాపదాన్నయినా ఇట్టే సొంతం చేసుకోగల సత్తా ఉంది. అందుకే ‘ఇటాలియన్‌ ఆఫ్‌ ద ఈస్ట్‌’ అని ఆకాశానికెత్తేశారు హాల్డెన్‌ దొరగారు. ‘సుందర తెనుంగై’ అని తెగ మెచ్చుకున్నారు తమిళకవి సుబ్రహ్మణ్యభారతి. అప్పయ్యదీక్షితులైతే తెలుగువాడిగా పుట్టనందుకు జీవితాంతం చింతించారు. ‘ఆంధ్రత్వం ఆంధ్రభాషాచ… నాల్పస్య తపసఃఫలమ్‌’ అంటూ తనకుతాను సర్దిచెప్పుకున్నారు. నిజమే మరి, తెలుగువాడిగా పుట్టాలన్నా, తెలుగు భాష మాట్లాడాలన్నా ఎంతో కొంత పుణ్యంచేసుకునుండాలి. పూర్వజన్మ సుకృతం ఉంటేకానీ, ఆ మహద్భాగ్యం దక్కదు.

Prev
1/8 Next »
Read 4002 times
Rate this item
(0 votes)
Published in తెలుగు

Leave a comment

Make sure you enter the (*) required information where indicated. HTML code is not allowed.

  Stay Connected with TAGKC

Galleries

 
   Welcome to TAGKC Dasara Deepavali Celebrations - 2017 !! దసరా...
Welcome to TAGKC Dasara & Diwali Celebrations 2017 !! Enroll to Participate...
 శ్రీ హేవిలంబి నామ సంవత్సర ఉగాది...

Who's Online

We have 35 guests and no members online

Get connected with Us

Subscribe to our newsletter

POPULAR TOPICS

  • ఇట్లు మీ విధేయుడు ..భమిడిపాటి రామగోపాలం
    భరాగో 'గా సుప్రసిద్ధులైన ప్రముఖ రచయిత భమిడిపాటి రామగోపాలం విజయనగరం జిల్లా పుష్పగిరిలో 1932 ఫిబ్రవరి 6న పుట్టారు.
    Read more...
  • అల్లూరి సీతారామరాజు చరిత్ర
    భారత స్వాతంత్ర్య చరిత్రలో అల్లూరి సీతారామరాజు (Alluri Sitaramaraju) ఒక మహోజ్వల శక్తి. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య…
    Read more...
  • గబ్బిలము- గుర్రం జాషువా
    గబ్బిలమును రచించినది గుర్రం జాషువా . జాషువా 1895 సెప్టెంబర్ 28న వినుకొండలో జన్మించాడు.కవికోకిల, నవయుగ కవి చక్రవర్తి ,…
    Read more...
  • మొల్ల రామాయణం
    “కుమ్మర మొల్ల”గా సుప్రసిద్ధురాలయిన కవయిత్రి మొల్ల జీవితంగురించి మనకి నిర్ధారణగా తెలిసింది స్వల్పం. ఆమెని గురించి చెప్పుకుంటున్న, ఋజువూ సాక్ష్యాలూ…
    Read more...
  • బారిష్టర్ పార్వతీశం
    మొక్కపాటి నరసింహశాస్త్రి సుప్రసిద్ధ తెలుగు హాస్య రచయిత. 1925 లో ప్రచురితమైన ఇతని బారిష్టర్ పార్వతీశం అన్న నవల తెలుగు…
    Read more...