
తెలుగు (6)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాష తెలుగు. భారత దేశం లో తెలుగు మాతృభాషగా మాట్లాడే 8.7 కోట్ల (2001 ) జనాభాతో ప్రాంతీయ భాషలలో మొదటి స్థానంలో ఉంది. ప్రపంచంలోని ప్రజలు అత్యధికముగా మాట్లాడే భాషలలో పదమూడవ స్థానములోనూ, భారత దేశములో హిందీ తర్వాత రెండవ స్థానములోను నిలుస్తుంది. పాతవైన ప్రపంచ భాష గణాంకాల (ఎథ్నోలాగ్) ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 7.4 కోట్లు మందికి మాతృభాషగా ఉంది. మొదటి భాషగా మాట్లాడతారు. అతి ప్రాచీన దేశ భాషలలో సంస్కృతము, తమిళములతో బాటు తెలుగు భాషను అక్టోబరు 31, 2008న భారత ప్రభుత్వము చేర్చింది.
భావ వ్యక్తీకరణలో తెలుగు ప్రపంచ భాషలన్నింటితోనూ పోటీ పడుతుంది. ప్రపంచంలోని అతి కొద్ది క్రమబద్ధీకరించబడిన భాషలలో ఇది ఒకటి. తెలుగు వ్యాకరణము చాలా తేలికగానూ, నిర్మాణపరంగా అతిశుద్ధంగానూ ఉంటుంది. అచ్చుతో అంతమయ్యే విషయం వల్ల ఇది సంగీతపరంగా సంగీతకారులకు చాలా ఇష్టమైన భాష. ముఖ్యముగా కర్ణాటక సంగీతం లోని చాలా కృతులు తెలుగు భాషలోనే ఉన్నవి. త్యాగరాజు, భద్రాచల రామదాసు, క్షేత్రయ్య, అన్నమయ్య, వంటివారు తమ తమ కృతులతో, కీర్తన లతో, తెలుగును సంగీతపరంగా సుసంపన్నం చేసినారు.
“ తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొకండ
ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స ”
—శ్రీ కృష్ణదేవ రాయలు
" జనని సంస్కృతంబు సకల భాషలకును
దేశభాషలందు తెలుగు లెస్స
జగతి తల్లికంటె సౌభాగ్యసంపద
మెచ్చు టాడుబిడ్డ మేలు గాదె? ”
— వినుకొండ వల్లభరాయడు
“ సంస్కృతంబులోని చక్కెర పాకంబు
అరవ భాషలోని అమృతరాశి
కన్నడంబులోని కస్తూరి వాసన
కలిసిపోయె తేట తెలుగునందు? ”
— మిరియాల రామకృష్ణ
వికీపీడియా నుండి
‘మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఈనాడు ఆదివారం అనుబంధ సంచిక కోసం శ్రీ. కర్లపాలెం హనుమంతరావు రాసిన ప్రత్యేక వ్యాసం ఇది. మన తల్లి భాష మీద చూపించవలసిన బాధ్యతను మరోసారి మనకు గుర్తుచేస్తోంది. చదవండి!
సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) ప్రజల భాషలో మరల మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి.
తెలుగు భాష ప్రస్తావన రాగానే ప్రపంచవ్యాప్తంగా పలికే పదం "ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్'' అని. 15వ శతాబ్దంలో ఇటాలియన్ యాత్రికుడు నికొలో కొంటి తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్(ప్రాచ్య ఇటాలియన్)గా అభివర్ణించాడు
చారిత్రక నేపథ్యం :
''తెలుగదేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొకండ
ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స''
- శ్రీకృష్ణదేవరాయలు
తెలుగు సాహిత్యానికి పునప్రతిష్ఠ చేసిన మహోన్నత వ్యక్తిగా సి.పి.బ్రౌన్. 1825 ప్రాంతాల్లో దాదాపు అంధకారం కప్పివేయబడివున్న తెలుగుకు వెలుగులు నింపి నేటి వైభవానికి కారణభూతుడైన బ్రౌన్‌ను అభిమానించని తెలుగువాడు ఉండడు.
ఏభాషా అంత తేలికగా వాగ్వ్యవహారం నుంచి జారిపోదు. సువ్యవస్థితమైన భాష ఏర్పడడానికి ఎంతకాలం పడుతుందో, అంతకంటే ఎక్కువ కాలమే జన వ్యవహారం నుంచి భాష మృగ్యమైపోవడానికి పడుతుంది. ఈ దశలో పతనం కూడా అంచెలంచెలుగానే ఉంటుంది. నేడు మన తెలుగు భాష దుస్థితికి కారణాలేమిటి?
Stay Connected with TAGKC
MORE ARTICLES
- ‘హరికథ’కు ఆద్యుడు ఆదిభట్ల Be the first to comment!
- సాహితీచైతన్య సృజనకారులు ఒద్దిరాజు సోదరులు Be the first to comment!
- మానవతా పరిమళ ప్రవాహం సినారె కవిత్వం Be the first to comment!
- హరికథ-ఆవిర్భావం Be the first to comment!
- తొలి తెలుగు శాసనం ఎక్కడ? Be the first to comment!
- తెలుగు సాహిత్యోద్యమనేత సురవరం ప్రతాపరెడ్డి Be the first to comment!
Galleries
Who's Online
We have 37 guests and no members online