తొలి కథా కావ్యం Featured

కథా కావ్యమంటే కథకీ, కథా రచనకీ ప్రాధాన్యంగలది. చిత్ర విచిత్రాలైన మహిమలు, మలుపులు, వినోదాలు-వింతలు, నీతులు గల కథల సంపుటిగల కావ్యాలు కథాకావ్యాలు. సమకాలీన సాంఘిక పరిస్థితుల చిత్రీకరణ వుంటుంది. కథాకథన శిల్పం ముఖ్యం. ఒక విధంగా చెప్పాలంటే చందమామ కథల్లో భేతాళ కధల్లాగా, కాశీమజిలీ కథల్లాగా వుంటాయనవచ్చు.

తిక్కన కాలంలో ప్రారంభమైన కథా కావ్యరచన శ్రీనాధ యుగంలో విస్తృతికెక్కింది. కథా కావ్యాలు చాలవరకు అనువాదాలు కావు-అనుసరణలు తప్ప.
తెలుగులో తొలి కథాకావ్యంగా ఎక్కువమంది అంగీకరిస్తున్నది కేతన రాసిన ‘దశకుమార చరిత్ర’.ఈ మూల ఘటిక కేతన తిక్కన శిష్యుడు. అంతేకాదు-ఈ దశకుమార చరిత్రను తిక్కనకే అంకితమిచ్చాడు! ఒక కవి మరొక కవికి, ఒక శిష్యుడు ఒక గురువుకు ఇచ్చిన తొలి రచన కూడా ఇదే! కవిత్రయంలో ఒక్క తిక్కనకి మాత్రమే కృతిభర్త అయ్యే అవకాశం లభించింది.

‘‘వివిధ కళానిపుణుడు, నభి
 నవ దండియానాగ బుధజనంబుచేతన్
 భువిపేరుగొనినవాడను’’

అని తన గురించి ప్రకటించాడు.
సంస్కృతంలో దండి ‘కావ్యాదర్శము’తోపాటు ‘దశకుమార చరిత్ర’ అనే గద్య కావ్యం రాసాడు. దీనికి ఇంచుమించుగా అనువాదమే కేతన దశకుమార చరిత్ర. అందుకే ఒకరిద్దరు అనువాదం కాబట్టి తొలి కథా కావ్యంగా అంగీకరించలేదు. ఆ దండి రచననుబట్టి కేతనకు ‘అభినవదండి’ అనే పేరు వచ్చింది. ఈ కేతన రాసిన ‘ఆంధ్ర భాషాభూషణం’ తెలుగులో రాయబడిన మొదటి వ్యాకరణ గ్రంథం. ఇతని ‘విజ్ఞానేశ్వరీయం’ కూడా తొలి ధర్మ శాస్త్ర గ్రంథం.
‘‘పదలాలిత్యముతో, మనోహరమైన వర్ణనలతో, సజీవమైన పాత్రలతో, సమకాలిక జీవితమును చిత్రించు ఘట్టములతో, హాస్య వ్యంగ్య సంభాషణములతో, రసోచితమైన కథనముతో...’’ దశకుమారుల సాహస చర్యలను, వారి ప్రేమ వృత్తాంతములను మనోహరంగా రాసాడని విమర్శకులు తెలిపారు. పనె్నండు ఆశ్వాసాలలో, సుమారు 1625 గద్యపద్యాలలో రాసాడు. తిక్కన మెప్పుపొందానని చెప్పాడు. తన కాలంనాటి ఆభరణాలను, కోడిపోరును, శృంగార వీర రసాలను హృదయంగమంగా వర్ణించాడు. ‘‘తేనియబడ్డ ఈగగతి’’, ‘‘కుక్కకు టెంకాయ దక్కదు’’ వంటి కొత్త పలుకుబడులు, వయ్యాళి (షికారు), సురంగము (సొరంగం) వంటి వాడుక పదాలూ దశకుమార చరిత్రలో కనిపిస్తాయి. కేతన పద్య రచనా వైభవానికి ఒక్క పద్యం-

‘‘చెఱుకటెవిల్లు! పువ్వులటె చిక్కని చక్కనియమ్ములేయుచో
 గఱియటె చిత్తముల్! హరుడు కోపమునంగనుగొన్న నంగముం
 బఱిపఱిమయ్యెనట్టె! తల ప్రాణము తోకకు వచ్చె! నెవ్వరిం
 గఱచుననంగు డేమిటికి కంపము చెందెదవంబుజాననా!’’

ద్వా.నా.శాస్త్రి
http://archives.andhrabhoomi.net/sahiti/toli-618

 

Read 2648 times
Rate this item
(0 votes)

Leave a comment

Make sure you enter the (*) required information where indicated. HTML code is not allowed.

  Stay Connected with TAGKC

Galleries

 
Welcome to TAGKC Dasara & Diwali Celebrations 2017 !! Enroll to Participate...
 శ్రీ హేవిలంబి నామ సంవత్సర ఉగాది...
Happy New Year 2017

Who's Online

We have 68 guests and no members online

Get connected with Us

Subscribe to our newsletter

POPULAR TOPICS

  • ఇట్లు మీ విధేయుడు ..భమిడిపాటి రామగోపాలం
    భరాగో 'గా సుప్రసిద్ధులైన ప్రముఖ రచయిత భమిడిపాటి రామగోపాలం విజయనగరం జిల్లా పుష్పగిరిలో 1932 ఫిబ్రవరి 6న పుట్టారు.
    Read more...
  • అల్లూరి సీతారామరాజు చరిత్ర
    భారత స్వాతంత్ర్య చరిత్రలో అల్లూరి సీతారామరాజు (Alluri Sitaramaraju) ఒక మహోజ్వల శక్తి. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య…
    Read more...
  • గబ్బిలము- గుర్రం జాషువా
    గబ్బిలమును రచించినది గుర్రం జాషువా . జాషువా 1895 సెప్టెంబర్ 28న వినుకొండలో జన్మించాడు.కవికోకిల, నవయుగ కవి చక్రవర్తి ,…
    Read more...
  • మొల్ల రామాయణం
    “కుమ్మర మొల్ల”గా సుప్రసిద్ధురాలయిన కవయిత్రి మొల్ల జీవితంగురించి మనకి నిర్ధారణగా తెలిసింది స్వల్పం. ఆమెని గురించి చెప్పుకుంటున్న, ఋజువూ సాక్ష్యాలూ…
    Read more...
  • బారిష్టర్ పార్వతీశం
    మొక్కపాటి నరసింహశాస్త్రి సుప్రసిద్ధ తెలుగు హాస్య రచయిత. 1925 లో ప్రచురితమైన ఇతని బారిష్టర్ పార్వతీశం అన్న నవల తెలుగు…
    Read more...