సంక్రాంతి సంస్కృతిలో సాహిత్య పర్వం

« Prev
2/3 Next »

సంక్రాంతి సంబరాల్లో తెలుగింటి ఆడపడుచుల, యువకుల సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో కను విందు చేస్తాయి.

ముఖ్యంగా సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని కవికసమ్మేళనాలు సాహిత్య గోష్ఠులు నిర్వహిస్తారు. ఆకాశవాణి, దూరదర్శన్‌లలో ప్రత్యేక కవిసమ్మేళనాలు నిర్వహించి ప్రసారం చేస్తారు. సాహిత్యాభిమానులకు ఈ కవిసమ్మేళనాలు వీనుల విందుచేస్తాయి.

సంక్రాంతి కరుణచేత పరిశుద్ధమైన ఆరోగ్యాన్ని, చల్లని హృదయాన్ని ప్రసా దించమని కోరుతున్నారు ఈ కవి. భాగ్యము గలవారికే ఈ భోగాలు. పేదవారికి లేదని బాధపడుతూ

''నింగికి నేలకున్‌ వెలుగు నిచ్చెడి తేజధనస్సు చేరగన్‌

మంగళమౌను భూతలము మార్గము ఉత్తరపుణ్యకాలపుం

సంగమ మందు సంగమము చక్కని ముగ్గులు యల్లిబిల్లికల్‌

-మహాశివభట్టు కనకరాజు

విష్ణుచిత్తుని ఇంటి పిన్నపట్టి గోదాదేవి మనసారా నోములునోచి శ్రీరంగనాథుని చేరి సేవించిన ఈ ధనుర్మాసం విష్ణుభక్తులకు ప్రియమైనదేకాదు, ముక్తికి మార్గదర్శి అంటున్నారు ఈ కవయిత్రి

''భాసిలు రంగవల్లికలు బాలికలాడెడి గొబ్బియాటలున్‌

దాసరి కీర్తనల్‌ మిగుల తాండవ మాడెడి గంగిరెద్దులున్‌

ఏసరు భోగిమంటలును ఇంపగు బొమ్మల కొల్వులున్‌ ధను

ర్మాసము మంగళ ప్రదము నమ్ముచు రంగని గొల్చువారికిన్‌'

ఏడాది కొక్కసారి యేతెంచు ఈ సంక్రాంతి యుగయుగాల నుండి ఉన్నకాంతియే. దీని ప్రాభవము పాతబడింది. లోక క్రాంతికిపుడు లోకశాంతి కూడా కావాలి. అంటూ కొత్త సంక్రాంతికి సర్వదోయ గానం చేస్తున్నాడో కవి

''భోగి మంటలందు గోగుబుల్లల గాదు

కామరోషములను గాల్పవలయు

గ్రొత్త పబ్బమందు గోడిపుంజులగాదు

దురభిమానములను ద్రుంపవలయు''

-తెనుగు లెంక శ్రీతుమ్మల సీతారామమూర్తి

నేటి సంక్రాంతిలో అలనాటి అందచందాలు లేవు. రంగవల్లులు, గుమ్మాలకు ముద్దబంతి తోరణాలు, ముద్దు గుమ్మలకేరింతలు ఇవాళ కనుమరుగవుతున్నాయి. భోగిమంటలు లేవు. డూడూ బసవన్నల ఆటపాటలు లేవు. పంట చేతికందని రైతన్నకు సంబరాలు ఎలా ఉంటాయి.

'కాంక్రీటు సంస్కృతితో భయం గుప్పిట్లో

ధృతరాష్ట్రుని కౌగిలిలో

సంక్రాంతి పురుషుడు ఉక్కిరిబిక్కిరి

ఇంకా మిగిలిపోయిన సంస్కృతికి

పతంగులు పోస్తున్న కొనఊపిరి

సంక్రాంతి సంబరాలకు ప్రతీకలు''

- కొలనుపాక మురళీధరరావు

ఈ హేమంత మాసాన్ని ఏమని పొగడుడు అణువణువునా అంతులేని కవిత్వం. సస్యలక్ష్మి విలాసంగా నడిచి వచ్చినది. చిట్టి చేమంతులు, చిరుదవనముతో కలిగి గట్టిన పుష్పహారమును కంఠమున ధరించి ప్రతి ఇంటి ముంగిట ప్రత్యక్షమైనదని ఈ రచయిత్రి కీర్తిస్తూ

ఏమని పొగడుదు ఈ హేమంత విలాసం

ఎల్లెడలా హరిత హరిద్ర సమ్మోహక ఇంద్రజాలం

అణువణువునా అంతులేని నవ్యత్వం

అంతా సంక్రాంతి లక్ష్మీవిభవనవైభవం''

-బాణగిరి వసుంధర

« Prev
2/3 Next »
Read 6823 times
Rate this item
(0 votes)

Leave a comment

Make sure you enter the (*) required information where indicated. HTML code is not allowed.

  Stay Connected with TAGKC

Galleries

Dear TAGKC Member   We would like to invite you and your family to Ugadi (శ్రీ...
Executive Committee Honarary Advisors Trust Boardకార్యవర్గం గౌరవ...
From TELUGU ASSOCIATION OF GREATER KANSAS CITY  
 'భోగి' భోగభాగ్యాలతో సంక్రాంతి'...

Who's Online

We have 38 guests and no members online

Get connected with Us

Subscribe to our newsletter

POPULAR TOPICS

 • ఇట్లు మీ విధేయుడు ..భమిడిపాటి రామగోపాలం
  భరాగో 'గా సుప్రసిద్ధులైన ప్రముఖ రచయిత భమిడిపాటి రామగోపాలం విజయనగరం జిల్లా పుష్పగిరిలో 1932 ఫిబ్రవరి 6న పుట్టారు.
  Read more...
 • అల్లూరి సీతారామరాజు చరిత్ర
  భారత స్వాతంత్ర్య చరిత్రలో అల్లూరి సీతారామరాజు (Alluri Sitaramaraju) ఒక మహోజ్వల శక్తి. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య…
  Read more...
 • గబ్బిలము- గుర్రం జాషువా
  గబ్బిలమును రచించినది గుర్రం జాషువా . జాషువా 1895 సెప్టెంబర్ 28న వినుకొండలో జన్మించాడు.కవికోకిల, నవయుగ కవి చక్రవర్తి ,…
  Read more...
 • మొల్ల రామాయణం
  “కుమ్మర మొల్ల”గా సుప్రసిద్ధురాలయిన కవయిత్రి మొల్ల జీవితంగురించి మనకి నిర్ధారణగా తెలిసింది స్వల్పం. ఆమెని గురించి చెప్పుకుంటున్న, ఋజువూ సాక్ష్యాలూ…
  Read more...
 • బారిష్టర్ పార్వతీశం
  మొక్కపాటి నరసింహశాస్త్రి సుప్రసిద్ధ తెలుగు హాస్య రచయిత. 1925 లో ప్రచురితమైన ఇతని బారిష్టర్ పార్వతీశం అన్న నవల తెలుగు…
  Read more...