బారిష్టర్ పార్వతీశం

మొక్కపాటి నరసింహశాస్త్రి సుప్రసిద్ధ తెలుగు హాస్య రచయిత. 1925 లో ప్రచురితమైన ఇతని బారిష్టర్ పార్వతీశం అన్న నవల తెలుగు హాస్య రచనలలో మరువలేని స్థానాన్ని పొందింది.

ఈ నవలలో ముఖ్య కథానాయకుడైన పార్వతీశం ఒక పల్లెటూరు నుండి బయలుదేరి ఇంగ్లండ్ వెళ్ళి న్యాయశాస్త్రం అభ్యసించి భారత దేశానికి తిరిగి వచ్చి న్యాయశాస్త్రాన్ని ప్రాక్టీసు చేసి మంచి పేరు సంపాందించి కథ చివరిభాగం లో స్వాతంత్ర్యోద్యమం లో పాల్గొంటాడు.ఈ నవల మూడు భాగాలుగా వెలువడింది.ఇందులో మొదటి భాగం అప్పటి నర్సాపురం ప్రాంతం యొక్క సామాజిక స్ధితిగతులను హాస్యరీతిలో తెలియచెప్పుతుంది. ఇది పార్వతీశం ఇంగ్లాండ్ ప్రయాణం, అతని అమాయకత్వం అయోమయం మొదలైనవాటితో వున్న గొప్ప హాస్య రచన.


 బారిష్టర్ పార్వతీశం మొదటి భాగం

 

పార్వతీశం మొగల్తూరు నుండి బయలు దేరి నిడదవోలు మీదుగా చెన్నై వెళ్తాడు. అక్కడ నుండి ఓడ పట్టుకొని ఇంగ్లాడు చేరుతాడు.ఈ భాగం చాలా హాస్యంగా నడుస్తుంది. ముఖ్యంగా నిడదవోలు నుండి మద్రాసు వెళ్ళే రైలు ప్రయాణం చాలా హాస్యరసంగా చిత్ర్రించడం జరిగింది. మద్రాసు నుండి ఇంగ్లాండు వెళ్ళడానికి కావలసిన సరంజామా కొనుక్కొనే సన్నివేశాలు చాలా హాస్యవత్తరంగా ఉంటాయి. ఈ నవలను తెలుగు అకాడమీ పుస్తకాల్లో పదవ తరగతి తెలుగు ఉపవాచకముగా అందించారు.

 బారిష్టర్ పార్వతీశం రెండవ భాగం

 ఓడలో ఇంగ్లండ్ చేరు కొన్న పార్వతీశం ఓడలో చిక్కిన స్నేహితుడి వల్ల స్కాట్‌లాండ్ లో ఎడిన్‌బరా నగరంలో ఒక ఇంట్లో పేయింగ్ గెస్టు గా చేరుతాడు. ఒక లా కాలేజి లో చేరుతాడు. ఆంగ్లం కుడా రాని పార్వతీశం ఏకసంధాగ్రహి క్రింద అన్ని విషయాలు ఒక్కసారి చెప్పడం తో గ్రహించి అందరి మన్ననలు పొందుతాడు. ఒక స్నేహితురాలిని ఆసక్తికరమైన సన్నివేశం ద్వారా పొందుతాడు. హాస్యం పాళ్ళు ఈ భాగం లొ తగ్గినా ఈ భాగం రసవత్తరంగానే ఉంటుంది. ఈ భాగం చివరి అంకం లొ బారిష్టర్ పాసై ఇంటి ప్రయాణం పట్టుతాడు. తన స్నేహితురాలు వదిలి వెళ్ళే సన్నివేశాన్ని మొక్కపాటి నరసింహశాస్త్రి గారు చాలా చక్కగా చిత్రించారు.


 బారిష్టర్ పార్వతీశం మూడవ భాగం

 మూడవ భాగం ముఖ్యంగా ఇంటివచ్చాక తనని ఇంటి వారు ఏవిధంగా స్వీకరించారు అనే విషయాలు, అప్పటి సాంప్రదాయల ప్రకారం బయటి దేశం నుండి వచ్చిన వారు ఎదుర్కొనే సంఘటనలు చిత్రించారు. ఇంగ్లాండు నుండి వచ్చాక గ్రామంలో ఉన్నవారు అడిగే వివిధమైన విచిత్ర ప్రశ్నలు చాలా అసక్తికరంగా ఉంటాయి. తరువాత పెళ్ళి, న్యాయశాస్త్ర ప్రాక్టీసు, స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనడం, ప్రకాశం పంతులు గారిని కలవడం, తాను సంపాదించిన సంపదను స్వాతంత్ర్యోద్యమానికి ధార పోయడం, పలు మార్లు జైలుకి వెళ్ళడం అనే విషయాలు ఉంటాయి. హాస్యం పాళ్ళు ఈ భాగంలో మరింత తగ్గుతుంది.

'బారిష్టర్ పార్వతీశం' అమ్మడానికి రచయిత పడిన కష్టాలు

ఒక ప్రముఖుని (పేరు తెలియదు) మాటలలో........ "ఒక రోజు కాలేజి నుంచి ఇంటి కొచ్చే సరికి మా ఇంటి అరుగు మీద వాలు కుర్చీలో కూర్చొని మా పిల్లలకి కథలు చెప్తూ నవ్విస్తున్నారు.. బారిస్టర్ పార్వతీశం నవలా రచయిత మొక్క పాటి నరసింహ శాస్త్రి గారు. కుశల ప్రశ్నలు అయింతర్వాత వచ్చిన పని చెప్పారు.

"వాడెవడో చెప్పితే నమ్మి ఐదు వేల కాపీలేశాను బారిస్టర్ పార్వతీశం. పది హేనేళ్లయింది. ఇంకా పదిహేను వందల పుస్తకాలు మిగిలి వున్నాయి. ఈ వూళ్లొ నాలుగైదు హైస్కూళ్లున్నాయంట గదా.... ఒక్కొక్క హైస్కూలు ఇరవై అయిదు చొప్పున కొన వచ్చట. అంతా కొంటే వంద పుస్తకాలు ఖర్చు అవుతాయి. కాపి రూపాయా పావలా... రేప్పొద్దున వెళ్లి ఒక్కొక్క హెడ్మాస్టర్ ను కలుసు కోవాలి. పని ఎంత వరకు అవుతుందో? "...... నాకు చాల భాద కలిగింది. బారిస్టర్ పర్వతీశం అంటే ఒక హాస్య మహా కావ్వం. దాన్ని అమ్ముకోడానికి రచయిత ప్రతి హైస్కూలుకూ ఎక్కే గుమ్మం దిగే గుమ్మంగా యాచించడమా?

"ఎన్ని పుస్తకాలు తెచ్చారు" అనడిగాను.

"వంద. అంటే నూట పాతిక రూపాయిలవి"

"మీరెక్కడికి వెళ్లకండి. అవి అమ్ముడయే మార్గం నేను చూస్తాను" అన్నాను. ఆ మర్నాడు ఒక తెల్ల కాగితం మీది ఒక ఆహ్వాన పత్రికను రాశాను ఇలా. "మొక్క పాటి వారు వచ్చారు. వారి బారిస్టర్ పార్వతీశం నవల వారి సంతకం తో ఇస్తారు. పుస్తకం వెల ఎంత వున్నా పుస్తకం తీసుకున్నవారు మాత్రం వారికి పది రూపాయలివ్వాలి. జేబులో పదేసి రూపాయిలేసుకొని రేపు సాయింత్రం ఆరు గంటలకి స్థానిక లైబ్రరి దడాబామీద జరిగే భావపురి రచయితల సమావేశానికి రావలసింది" అంటూ ఒక విధ్యార్తికి ఆ కాగితం ఇచ్చి వూళ్లో వున్న లెక్చరర్లు, ప్లీడర్లు, ఉద్యోగులు, విద్యావంతులు ఇతర పుర ప్రముఖులలు చూపించి, వారు చూసి నట్లు సంతకాలు చేయించుకొని రమ్మని పంపించాను.

కాగితం మీద సంతకాలయితే అరవై మంది చేశారు. కాని సభకు వచ్చి మొక్క పాటి వారి సంతకంతో వున్న నవలని పదిరూపాయిలిచ్చి తీసుకోడానికి, ఆయన ఉపన్యాసం వినడానికి నూట పది మంది వచ్చారు. పుస్తకాలు వందే వుండడం వల్ల పది మందికి ఇవ్వలేక పోయాము. కాని రచయితకి గంటలో వెయ్యి రూపాలొచ్చాయి. అదీ ఎలా? భక్తి ప్రవుత్తులతో సంర్పించినవి. మొక్క పాటి వారు ఎంత సంతోషించారో.... నా చేతులు పట్టుకొని " నూట పాతిక వస్తే చాలనుకున్నాను. కాని వెయ్యి రూపాయిలొచ్చాయి.... నీ వల్లనే" అన్నారు. క్షమించండి ఇది నావల్ల గాదు, బాపట్లలో వున్న రసజ్ఞుల వల్ల ... ఒక మంచి గ్రంధాన్ని ... రచయిత చేతుల మీదుగా తీసుకోవాలనే అకాంక్ష వుండడం వల్లా....... ఇది వీరందరి రసజ్ఞత.. సంస్కారమూను.." అన్నాను. అదే ఈ రోజుల్లో అయితే సాద్యమేనా?

బారిస్టర్ పార్వతీశం సినిమా

1940లో విడుదలయ్యిన బారిస్టర్ పార్వతీశం సినిమా తెలుగులో మొట్టమొదటి హస్యకథా చిత్రం. మొక్కపాటి నరిశింహ శాస్త్రి రచించిన బారిస్టర్ పార్వతీశం నవల ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు ఎచ్.ఎమ్.రెడ్డి దర్శకత్వం వహించాడు. లంక సత్యం ప్రధాన పాత్రలో నటించగా జి.వరలక్ష్మి పార్వతీశం భార్యగా నటించింది. ఈ సినిమా అనుకున్నంత అర్థిక విజయం సాధించలేకపోయినా మొదటి తెలుగు హస్యకథ సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది.

--వికీపీడియా నుండి మరియు తెలుగు సాహిత్యం దాట్కాం సౌజన్యంతో

 

Read 3149 times
Rate this item
(0 votes)

1 comment

Leave a comment

Make sure you enter the (*) required information where indicated. HTML code is not allowed.

  Stay Connected with TAGKC

Galleries

 
   Welcome to TAGKC Dasara Deepavali Celebrations - 2017 !! దసరా...
Welcome to TAGKC Dasara & Diwali Celebrations 2017 !! Enroll to Participate...
 శ్రీ హేవిలంబి నామ సంవత్సర ఉగాది...

Who's Online

We have 19 guests and no members online

Get connected with Us

Subscribe to our newsletter

POPULAR TOPICS

  • ఇట్లు మీ విధేయుడు ..భమిడిపాటి రామగోపాలం
    భరాగో 'గా సుప్రసిద్ధులైన ప్రముఖ రచయిత భమిడిపాటి రామగోపాలం విజయనగరం జిల్లా పుష్పగిరిలో 1932 ఫిబ్రవరి 6న పుట్టారు.
    Read more...
  • అల్లూరి సీతారామరాజు చరిత్ర
    భారత స్వాతంత్ర్య చరిత్రలో అల్లూరి సీతారామరాజు (Alluri Sitaramaraju) ఒక మహోజ్వల శక్తి. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య…
    Read more...
  • గబ్బిలము- గుర్రం జాషువా
    గబ్బిలమును రచించినది గుర్రం జాషువా . జాషువా 1895 సెప్టెంబర్ 28న వినుకొండలో జన్మించాడు.కవికోకిల, నవయుగ కవి చక్రవర్తి ,…
    Read more...
  • మొల్ల రామాయణం
    “కుమ్మర మొల్ల”గా సుప్రసిద్ధురాలయిన కవయిత్రి మొల్ల జీవితంగురించి మనకి నిర్ధారణగా తెలిసింది స్వల్పం. ఆమెని గురించి చెప్పుకుంటున్న, ఋజువూ సాక్ష్యాలూ…
    Read more...
  • బారిష్టర్ పార్వతీశం
    మొక్కపాటి నరసింహశాస్త్రి సుప్రసిద్ధ తెలుగు హాస్య రచయిత. 1925 లో ప్రచురితమైన ఇతని బారిష్టర్ పార్వతీశం అన్న నవల తెలుగు…
    Read more...