Children categories

History/చరిత్ర (16)

 History/చరిత్ర

గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర (ఆంగ్లం: History). ఒక శాస్త్రముగా నిర్వచించినప్పుడు ప్రాధమికముగా రాతల ద్వారా భద్రపరచబడిన, జరిగిన కాలములోని మనుషుల, కుటుంబాల మరియు సమాజాల యొక్క పరిశీలన మరియు అధ్యయనమే చరిత్ర అని చెప్పవచ్చు. ఈ విధముగా చరిత్రను పూర్వ చరిత్రతో భేదిస్తారు. చరిత్ర యొక్క జ్ఞానము సాధారణంగా జరిగిన సంఘటనల యొక్క జ్ఞానముతో పాటు చరిత్ర ఆలోచనా సాధనాల యొక్క జ్ఞానమును కూడా పరిగణలోకి తీసుకుంటుంది.

సాంప్రదాయకంగా చరిత్ర అధ్యయనము మానవీయ శాస్త్రములలో భాగముగా పరిగణిస్తారు. అయితే ఆధునిక విద్యావర్గము చరిత్రను కాలక్రమము (క్రోనాలజీ) మరియు హిస్టోరియోగ్రఫీ అను ఉపవిభాగములతో సామాజిక శాస్త్రములలో భాగముగా వర్గీకరిస్తున్నారు.

(వికీపీడియా నుండి )

View items...

Books/ గ్రంధాలయం (6)

Books/ గ్రంధాలయం

పుస్తకము లేదా గ్రంథం (Book) అనేది వ్రాసిన లేదా ముద్రించిన కాగితాల సంగ్రహం. పుస్తకాలను సేకరించి. ప్రజల ఉపయోగార్ధం అన్నిరకముల పుస్తకాలను ఒకేచోట చేర్చి పరిరక్షించు ప్రదేశం గ్రంథాలయము.

 

వికీపీడియా నుండి

View items...

సాహిత్యం (8)

సాహిత్యం

సాహిత్యం (లాటిన్ litterae నుండి (బహువచనం); అక్షరం) అనేది రచనల చేసే కళ మరియు ఇది ప్రచురించబడిన వనరులకు మాత్రమే పరిమితం కాదు (అయితే, కొన్ని పరిస్థితుల్లో వాటిని మినహాయించవచ్చు). సాధారణంగా చెప్పాలంటే, సాహిత్యం అనే పదానికి అర్థం "అక్షరాలతో సాన్నిహిత్యం" ("కళలు మరియు అక్షరాలు"లో వలె). రెండు ప్రాథమిక రచనా సాహిత్య వర్గాల్లో కల్పన మరియు కల్పనేతర వర్గాలు ఉన్నాయి.
(వికీపీడియా నుండ

View items...

సంస్కృతి (4)

సంస్కృతి

సంస్కృతి (ఆంగ్లం Culture) అనేది మానవ సమాజం జీవన విధానంలో ప్రముఖమైన విషయాలను - అనగా జీవనం, ఆచారాలు, వ్యవహారాలు, ప్రమాణాలు, మతం, సంబంధాలు, పాలన - వంటివాటిని సూచించే పదం. దీనికి ఆంగ్ల పదమైన Culture లాటిన్ పదం cultura లేదా colere అనేవి "to cultivate" అనగా వ్యవసాయం చేయడం నుండి ఉద్భవించాయి.  ఒక సమాజంలో ముఖ్యమైన పద్ధతులు మరియు నిర్మాణాలు మరియు వ్యవస్థలు ఆ సమాజం యొక్క సంస్కృతిని సూచిస్తాయి. సంస్కృతిని సూచించే సంకేతాలు, నిర్మాణాలు, వ్యవస్థలు, ఆచారాలు, వ్యవహారాలు ఇదమిత్థమైన హద్దులు లేవు, అవి నిరంతరాయంగా మారుతుంటాయి. ఒకదానితో ఒకటి కలుస్తూ, విడిపోతూ పరిణామం చెందుతుంటాయి.

ఒక సమాజం జీవనంలో మిళితమైన కళలు, నమ్మకాలు, సంస్థలు, తరాలలో జరిగే మార్పులు, తరాల మధ్య వారసత్వంగా కొనసాగే విధానాలు అన్నీ కలిపి "సంస్కృతి" అంటారు. ఒక సమాజం యొక్క సంపూర్ణ జీవన విధానమే ఆ సమాజపు సంస్కృతి అని నిర్వచింపవచ్చును. ఆ సమాజంలో పాటించే ఆచారాలు, పద్ధతులు, అభివాదాలు, వస్త్రధారణ, భాష, మతం, ఆటలు, విశ్వాసాలు, కళలు - అన్నీ కలిపి సంస్కృతి అవుతాయి. గతించిన కాలం గురించి భవిష్యత్ తరాలకు అందించే వారధి సంస్కృతి

(వికీపీడియా నుండి)

 

View items...

ఇతిహాసాలు (0)

ఇతిహాసాలు

రామాయణ, మహా భారతము లను ఇతిహాసములు అందురు. "ఇతి-హాస" - అనగా "ఇలా జరిగిందని చెప్పారు" అన్న పదం నుండి "ఇతిహాసం" ఉద్భవించింది. ఇది ఒకప్పుడు చరిత్రకు పర్యాయంగా వాడారు. భారతీయ సాహిత్యం, సంస్కృతి, ఆలోచనావిధానాలపై వీటి ప్రభావం చాలా బలంగా ఉంది. ఈ ఇతిహాసాలను వివిధ భారతీయ భాషలలోకి అనువదించారు. అవి కూడా ఆయా భాషల సాహిత్యంలోను, సంస్కృతిలోను విశేషమైన ప్రాచుర్యం కలిగి ఉన్నాయి.

ప్రాచీన సంస్కృతవాఙ్మయంలో పురాణాలు, ఇతిహాసాలు ఒక కోవకు చెందుతాయి. వేదాలలో చెప్పబడిన మౌలిక విషయాలకు ఇతిహాసాలు అనుబంధ గ్రంధాలని, వేదాలలో ఉన్న సిద్ధాంతాలకు వివరణ పురాణ ఇతిహాసాలలో వివరణ మరియు సోదాహరణ లభిస్తుందని భావింపవచ్చును.

..వికీపీడియా నుండి

View items...

తెలుగు (6)

తెలుగు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాష తెలుగు. భారత దేశం లో తెలుగు మాతృభాషగా మాట్లాడే 8.7 కోట్ల (2001 ) జనాభాతో ప్రాంతీయ భాషలలో మొదటి స్థానంలో ఉంది. ప్రపంచంలోని ప్రజలు అత్యధికముగా మాట్లాడే భాషలలో పదమూడవ స్థానములోనూ, భారత దేశములో హిందీ తర్వాత రెండవ స్థానములోను నిలుస్తుంది. పాతవైన ప్రపంచ భాష గణాంకాల (ఎథ్నోలాగ్) ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 7.4 కోట్లు మందికి మాతృభాషగా ఉంది. మొదటి భాషగా మాట్లాడతారు. అతి ప్రాచీన దేశ భాషలలో సంస్కృతము, తమిళములతో బాటు తెలుగు భాషను అక్టోబరు 31, 2008న భారత ప్రభుత్వము చేర్చింది.

భావ వ్యక్తీకరణలో తెలుగు ప్రపంచ భాషలన్నింటితోనూ పోటీ పడుతుంది. ప్రపంచంలోని అతి కొద్ది క్రమబద్ధీకరించబడిన భాషలలో ఇది ఒకటి. తెలుగు వ్యాకరణము చాలా తేలికగానూ, నిర్మాణపరంగా అతిశుద్ధంగానూ ఉంటుంది. అచ్చుతో అంతమయ్యే విషయం వల్ల ఇది సంగీతపరంగా సంగీతకారులకు చాలా ఇష్టమైన భాష. ముఖ్యముగా కర్ణాటక సంగీతం లోని చాలా కృతులు తెలుగు భాషలోనే ఉన్నవి. త్యాగరాజు, భద్రాచల రామదాసు, క్షేత్రయ్య, అన్నమయ్య, వంటివారు తమ తమ కృతులతో, కీర్తన లతో, తెలుగును సంగీతపరంగా సుసంపన్నం చేసినారు.

“ తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొకండ
ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స ”

—శ్రీ కృష్ణదేవ రాయలు

" జనని సంస్కృతంబు సకల భాషలకును
దేశభాషలందు తెలుగు లెస్స
జగతి తల్లికంటె సౌభాగ్యసంపద
మెచ్చు టాడుబిడ్డ మేలు గాదె? ”

— వినుకొండ వల్లభరాయడు

“ సంస్కృతంబులోని చక్కెర పాకంబు
అరవ భాషలోని అమృతరాశి
కన్నడంబులోని కస్తూరి వాసన
కలిసిపోయె తేట తెలుగునందు? ”

— మిరియాల రామకృష్ణ

 వికీపీడియా నుండి

View items...

Get connected with Us

Subscribe to our newsletter

POPULAR TOPICS

  • ఇట్లు మీ విధేయుడు ..భమిడిపాటి రామగోపాలం
    భరాగో 'గా సుప్రసిద్ధులైన ప్రముఖ రచయిత భమిడిపాటి రామగోపాలం విజయనగరం జిల్లా పుష్పగిరిలో 1932 ఫిబ్రవరి 6న పుట్టారు.
    Read more...
  • అల్లూరి సీతారామరాజు చరిత్ర
    భారత స్వాతంత్ర్య చరిత్రలో అల్లూరి సీతారామరాజు (Alluri Sitaramaraju) ఒక మహోజ్వల శక్తి. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య…
    Read more...
  • గబ్బిలము- గుర్రం జాషువా
    గబ్బిలమును రచించినది గుర్రం జాషువా . జాషువా 1895 సెప్టెంబర్ 28న వినుకొండలో జన్మించాడు.కవికోకిల, నవయుగ కవి చక్రవర్తి ,…
    Read more...
  • మొల్ల రామాయణం
    “కుమ్మర మొల్ల”గా సుప్రసిద్ధురాలయిన కవయిత్రి మొల్ల జీవితంగురించి మనకి నిర్ధారణగా తెలిసింది స్వల్పం. ఆమెని గురించి చెప్పుకుంటున్న, ఋజువూ సాక్ష్యాలూ…
    Read more...
  • బారిష్టర్ పార్వతీశం
    మొక్కపాటి నరసింహశాస్త్రి సుప్రసిద్ధ తెలుగు హాస్య రచయిత. 1925 లో ప్రచురితమైన ఇతని బారిష్టర్ పార్వతీశం అన్న నవల తెలుగు…
    Read more...