గణతంత్ర దినొత్సవ శుభాకాంక్షలు - 2018 Featured

 


Wishing you and your family a great Happy Republic Day !!

మీకు మీ కుటుంబ సభ్యులకు గణతంత్ర దినోత్సవ  శుభాకాంక్షలు !!
 
దేశవ్యాప్తముగా అందరూ జరుపుకొనే జాతీయ పండగ గణతంత్ర దినోత్సవము (Republic Day) . 200 సంవత్సరాల పైగా మన దేశాన్ని ఆంగ్లేయులు పరిపాలించిరి. వారు పరిపాలించినంత కాలము మనదేశములోని పరిపాలనా విదానము బ్రిటిష్ రాజ్యాంగము ప్రకారము జరిగేది. వారు వెళ్లిపోయాక మన దేశాన్ని మనమే పరిపాలించుకునేందుకు రాజ్యాంగాన్ని తయారుచేసుకోవాల్సి వచ్చింది. రాజ్యాంగమూ తయారైనది , అలా తయారయిన రాజ్యాంగము ఎప్పుదో ఒకప్పుడు మొదలిపెట్టాలి కదా, మనము అలా మొదలు పెట్టిన రోజే .. 1950 జనవరి 26. ఆ రోజు నుంచి మనము ప్రతి సంవత్సరము జనవరి 26 న పండగ జరుపుకుంటున్నాము .
 
మనకు 1947 ఆగస్టు 15 న స్వాతంత్రము వచ్చినది. రాజ్యాంగము తయారు చేయడానికి ఎంతోమంది మేధావులు ఎన్నో దేశాల రాజ్యాంగాలను పరిశీలించి , ఎన్నో అంశాలతొ చాలా కాలం పాటు కృషి చేసి రూపొందించారు. ఈ రాజ్యాంగము తయారు చేయటానికి రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది. దీనికి అద్యక్షుడుగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఎన్నికయ్యారు. 1947 ఆగస్టు 29 న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఛైర్మన్ గా రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పడింది. అనేక సవరణల అనంతరము 1949 నవంబరు 26 న భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. భారత రాజ్యాంగాన్ని 2 (రెండు)సంవత్సరాల, 11 నెలల, 18 రోజుల కాలములో పూర్తిచేశారు. ప్రపంచములోనే అతి పెద్ద రాజ్యాంగమైన భారత రాజ్యాంగము లిఖిత రాజ్యాంగము. అలా తయారైన రాజ్యాంగాన్ని 1950 జనవరి 26 నుంచి అమలుపరిచారు. నాటినుండి భారతదేశము " సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యముగా రూపొందింది.
 
 TAGKC respects your privacy. If you do not wish to receive TAGKC communications you may opt out by clicking: {unsubscribe}Unsubscribe{/unsubscribe}
 
 
 
 
 
 
Read 3037 times
Rate this item
(1 Vote)
Published in Tagkc updates

1 comment

Leave a comment

Make sure you enter the (*) required information where indicated. HTML code is not allowed.

Get connected with Us

Subscribe to our newsletter

POPULAR TOPICS

  • ఇట్లు మీ విధేయుడు ..భమిడిపాటి రామగోపాలం
    భరాగో 'గా సుప్రసిద్ధులైన ప్రముఖ రచయిత భమిడిపాటి రామగోపాలం విజయనగరం జిల్లా పుష్పగిరిలో 1932 ఫిబ్రవరి 6న పుట్టారు.
    Read more...
  • అల్లూరి సీతారామరాజు చరిత్ర
    భారత స్వాతంత్ర్య చరిత్రలో అల్లూరి సీతారామరాజు (Alluri Sitaramaraju) ఒక మహోజ్వల శక్తి. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య…
    Read more...
  • గబ్బిలము- గుర్రం జాషువా
    గబ్బిలమును రచించినది గుర్రం జాషువా . జాషువా 1895 సెప్టెంబర్ 28న వినుకొండలో జన్మించాడు.కవికోకిల, నవయుగ కవి చక్రవర్తి ,…
    Read more...
  • మొల్ల రామాయణం
    “కుమ్మర మొల్ల”గా సుప్రసిద్ధురాలయిన కవయిత్రి మొల్ల జీవితంగురించి మనకి నిర్ధారణగా తెలిసింది స్వల్పం. ఆమెని గురించి చెప్పుకుంటున్న, ఋజువూ సాక్ష్యాలూ…
    Read more...
  • బారిష్టర్ పార్వతీశం
    మొక్కపాటి నరసింహశాస్త్రి సుప్రసిద్ధ తెలుగు హాస్య రచయిత. 1925 లో ప్రచురితమైన ఇతని బారిష్టర్ పార్వతీశం అన్న నవల తెలుగు…
    Read more...